మండలంలోని చింతలూరు ప్రాథమిక పాఠశాల 30 మంది విద్యార్థులకు రూ.15000 విలువ గల డ్రెస్సులను ప్రాథనోపాధ్యాయులు రఘు పాఠశాలకు అందజేయటం జరిగిందని కొలి ప్యాక్ సింగిల్ విండో చైర్మన్ నాగుల శ్రీనివాస్ తెలిపారు. అట్టి డ్రెస్సులను ఏం ఈవో శ్రీనివాస్, కొలి ప్యాక్ సింగిల్ విండ చైర్మన్ నాగుల శ్రీనివాస్ చేతుల మీదుగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగింది.అందుకు గాను ప్రధానోపాధ్యాయుడు రఘు కు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, సింగిల్ విండ చైర్మన్ నాగుల శ్రీనివాస్,ఉపాధ్యాయులు మరియు విడి సి సభ్యులు పాల్గొన్నారు.