అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలి…

నవతెలంగాణ-మెదక్‌
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బస్వరాజు అన్నారు. శుక్రవారం మెదక్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 12 రోజు లుగా సమ్మె నిర్వహిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగులను భయబ్రాం తులకు గురిచేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమ న్నారు. జిల్లాలో తప్పుడు ప్రచారం చేయడంలో అధికారులు అత్యుత్సాహం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తోటి మహిళ ఉద్యోగులని చూడకుండా వేధింపులకు గురిచేj ుడం సిగ్గుచేటన్నారు. జిల్లాలు అంగన్వాడీ సెంటర్ల తాళాలు అధికారులే దొంగల్గాగా పగలకొట్టారని మండి పడ్డారు. సెంటర్ల తాళాలు పగలకొట్టడం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, అంగన్వాడీ సమస్యలు పరిష ్కరించకుంటే వచ్చే ఎన్నికలలో బుద్ధిచెప్తామన్నారు. ఈ కార్య క్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు, బాలమని, అంగన్వాడీలు రాజ్యలక్ష్మి, లత, రాణి, మంజుల, జాబీన, శ్యామల, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.