
మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని మున్సిపల్ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు బాపూరావు అన్నారు. పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమం గురువారంతో రెండవ రోజుకు చేరుకుంది ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన సమయానికి వేతనాలు అనునిత్యం పెరుగుతున్న నిత్య అవసర వస్తువులను దృష్టిలో పెట్టుకొని వేతనాలు కూడ పెంపు చేయాలని,పిఎఫ్ డబ్బులు జమ కానీ వారికీ తొందరగా వారియొక్క పరిష్కారం చేయాలని 8 నెలాల ఏరియల్ డబ్బులు తక్షణమే కార్మికులందందరికి వారి వారి ఖాతా లో జమ చేయాలని డిమాండ్ చేశారు. డ్యూటీ సమయంలో కార్మికులకు ఏదైనా గాయం మరియు మొదలగు ఏమైనా కార్మికునికి జరిగితే దానికి మున్సిపల్ బాధ్యత వహించాలి అని ,కార్మిక సోదరా సోదరిమనులకు అందరికి సరైన పని ముట్లు బట్టలు..భద్రత వస్తువులను కల్పించాలి అని,వారానికి ఒకరోజు పూర్తి సెలవు దినం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులు ఎవరైనా అకాల మరణం చాందినచో వారి కుంటుంబానికి మున్సిపల్ వారి ఆధ్వర్యంలో 20,000/- రూపాయలు ఇవ్వాలని అన్నారు12 వ పిఆర్సి ప్రకారం ప్రతి ఒక్క కార్మికునికి 26000/- రూపాయలు వేతనం ఇవ్వాలని ,మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ తక్షణమే పర్మినెంట్ చేయాలని అన్నారు ..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి రఫీ, ఉపాధ్యక్షులు రాహుల్ ,మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.