
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ గురువారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుజాత మాట్లాడుతూ.. నగరంలో కుక్కల బెడద రోజురోజుకీ పెరుగుతుందని చిన్నపిల్లల పైన పెద్ద వాళ్ళ పైన బైకులపై వెళ్తున్న వాళ్లపైన దాడులకు పాల్పడుతున్నాయని తెలిపారు. అయితే వీటివల్ల కొన్ని సందర్భాల్లో ప్రజల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది అని తెలియజేశారు. అలాగే వీధుల్లో పిచ్చికుక్కల బెడద విపరీతంగా పెరిగింది రోడ్లపైన పశువులు ఎక్కడికక్కడ నిలిచి ఉండడం వల్ల వచ్చే పోయే ప్రజలకు అవి తోపులాడుకుంటూ ప్రజలపైకి రావటం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున వాటిని గోశాలకు తరలించి రోడ్లపై ప్లాస్టిక్ తిని పశువులు మరణిస్తున్నాయి కాబట్టి వాటి ప్రాణాన్ని కాపాడాలని అలాగే నగరంలో వర్షాల కారణంగా రోడ్లపై గుంతలు ఏర్పడి ఎక్కడికక్కడ గుంతల్లో నీళ్లు నిలిచిపోవడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి, అలాగే నిలిచిన నీళ్ల వల్ల దోమలతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పోసేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు కటారి రాములు, నలవాల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.