అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి

నవతెలంగాణ-భిక్కనూర్
అంగన్వాడీ టీచర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి యాదమ్మ డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మెలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు, రిటర్మెంట్ అయినా అంగన్వాడీ కార్యకర్తలకు 10 లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు