అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి– అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కే నర్సమ్మ, సీఐటీయూ
– జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ
నవతెలంగాణ-పరిగి
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్‌ వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు కే నర్సమ్మ, సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. సో మవారం పరిగి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి ఇల్లును అంగన్‌వాడి టీచర్లు ముట్టడించారు. ఈ సం దర్భంగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. అంగన్‌వాడీి యూనియన్‌ జిల్లా అధ్య క్షురాలు కే నర్సమ్మ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ..అంగన్‌వాడీలకు తక్షణమే రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.2 లక్షలు, హెల్పర్లకు లక్ష రూపా యలు సౌకర్యం కల్పించాలన్నారు. వీఆర్‌ఎస్‌ సౌకర్యం క ల్పించాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం అంగన్‌ వాడీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా రూ. 2 లక్షల పెన్ష న్స్‌ సౌకర్యం వీఆర్‌ఎస్‌ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇ చ్చిందన్నారు. అనంతరం ప్రభుత్వం మారి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయి ఏడు నెలలు గడుస్తున్నా అంగన్‌వా డీల పట్ల కక్షపూరితంగా జీవో 10 తీసుకు వచ్చి అతి తక్కువ డబ్బులు ఇచ్చి 60 సంవత్సరాలు దాటిన వారం దరిని నిర్దాక్షణ్యంగా జులై 30 నుంచి ఇంటికి పంపాలని నిర్ణయించడం దుర్మార్గం అన్నారు. అంగన్‌వాడీలకు గ్రా టిటీ, జీతములో సగం పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశా రు. లేనిచో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేష్‌, మంజుల, స్వరూప, నిర్మల పార్వతమ్మ, పుల్లమ్మ, సంతోష, నిర్మల, మల్లమ్మ, శ్వేత, కమల, దేవి తదితరులు పాల్గొన్నారు.