– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపాల్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
తెలంగాణలో రవాణా రంగంలో కార్మికులు ఎదు ర్కొంటున్న సమస్యలను, ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. శనివారం ఏఐ ఆర్‌టీ డబ్ల్యూ ఎఫ్, సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాస్త్రీపురం డివిజన్ పరిధిలోని వట్టపల్లిలో జరిగిన ఆటో ర్యాలీ కార్యక్రమంలో భూపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రవాణా రంగ కా ర్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని స్వాగతిస్తున్నామని అదేవిధంగా ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. రవాణా రంగా కార్మికులకు గీత, నేత కా ర్మికుల ఇస్తున్న విధంగా నెలకి రూ.4500/-నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. భవన నిర్మా ణ కార్మికుల మాదిరిగానే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయా లని, డ్రైవర్లకు నష్టం చేసే కేంద్రంలో ఉన్నటు బీజేపీ ప్రభుత్వం ‘భారత న్యాయ సంహిత’చట్టంలోని సెక్షన్ 106(1)(2) ఎత్తివేయాలన్నారు. ఈ చట్టాల ద్వారా శిక్ష లు ప్రమాదం జరిగిన సమయంలో రక్షణ కోసం స్పాట్లో డ్రైవర్ వెళ్లి పోతే అటువంటి ఘటనలకు ‘హిట్ అండ్ రన్’ 7 లక్షల వరకు జరిమానా 10 ఏండ్లు జైలు శిక్ష పడుతుందన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే డ్రైవర్లు బతుకులు జైలు పాలువుతాయి. వెంటనే ఈ హిట్ అండ్ రన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఆర్‌టీ డబ్ల్యూ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాజాల రుద్ర కుమార్, జిల్లా అధ్యక్షులు రాములు, రాజేంద్రనగర్ మండలం వట్టిపల్లి అడ్డా ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు ఇసాక్ కార్యదర్శి సాజిద్, మహమూద్, ఖదీర్, ముజీఫ్ ఫరూక్, జాంగిర్, సలీం, స్వామి, వెంకటయ్య మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.