నవతెలంగాణ – కంఠేశ్వర్
బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల వేతన సవరణ, రిటైరీస్ కు పెన్షన్ సవరణ, 4జి/5జి సర్వీసులను వెంటనే ప్రారంభించాలని, క్యాజువల్ కాంట్రాక్టు వర్కర్స్ యొక్క సమస్యలను పరిష్కరించాలని క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు ఈపీఎఫ్, ఈఎస్ఐ, సదుపాయాలు కల్పించాలని మొదలైన సమస్యలపైన దేశవ్యాపితంగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్, ఏఐబిడిపీఏ, బిఎస్ఎన్ఎల్ సిసి డబ్ల్యుఎఫ్ ల కో-ఆర్డినేషన్ కమిటీ న్యూ ఢిల్లీ,పిలుపు నిచ్చింది. అందులో భాగంగా, శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో కూడా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో భోజన విరామ సమయంలో భారీ ప్రదర్శనలు , ధర్నా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈవీఎల్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. న్యాయమైన పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ఈ భారీ ప్రదర్శనలలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, డి ఓ టి/బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు, బిఎస్ఎన్ఎల్ క్యాజువల్ కాంట్రాక్టు వర్కర్స్ అధిక సంఖ్యలో దాదాపు 50 మంది కి పైగా పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో సాయన్న,మధుసూదన్,సి లీల, పాండురంగమ్, ముతెన్న, సుభాష్, క్రిష్ణ, అనురాధ, లత, సాయిలు, బాబన్న పాల్గొన్నారు.