భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి
నవతెలంగాణ –  వీర్నపల్లి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎగు మంటి ఎల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీర్నపల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్వర్యంలో ఆదివారం కార్మిక సమస్యలు పరిష్కరించాలని  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి  సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మంత్రులకు, జిల్లా కలెక్టరు లకు ఎన్ని సార్లు సమస్యల్ని విన్నవించినా కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కార్మికుల కు వెల్ఫేర్ బోర్డు లో పెన్షన్, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్స్  ఎన్నోరకాల అవకాశాలు ఉన్నప్పటికీ గత రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తు కార్మికులను పట్టించు కోలేదన్నారు . వెల్ఫేర్ బోర్డు లో కార్మికుల పిల్లలకు హాస్పిటల్ డెలివరీ కి, పెండ్లి లకు ప్రభుత్వం ఇస్తున్న 30 వెలను 1 లక్ష రూపాయల కు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే నార్మల్ డెత్ కు 1లక్ష 30 వేలు ఉన్నదాని 2లక్ష ల 50 వేలకు పెంచాలి, ఆక్సిడెంట్స్ కు6 లక్ష లు ఉన్నదానిని 10 లక్ష ల వరకు భీమా ఇవ్వాలన్నారు. అదేవిదంగా వలస కార్మికుల ద్వారా ఇక్కడ ఉన్నా కార్మికుల కు పనులు లేక కుటుంబం గడువడం కష్టంగా మారిందని కార్మికులను ఆదుకోవాలి.55 సం లు నిండిన కార్మికునికి పెన్షన్ 5 వేలు ఇవ్వాలి , జిల్లాలో మరణించిన కార్మికుల బీమా డబ్బులు పెండింగ్ ఉన్నాయి పెండింగ్ లో   ఉన్నవి త్వరగా విడుదల చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు మల్లారపు దేవయ్య,  జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి కటుకురి రాజు, ఉపాధ్యక్షులు రాజెల్లయ్య , కోశాధికారి శంకర్, కార్మికులు ఉన్నారు.