
కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలను వెంటనే పరిష్కరించి, రెగ్యులరైజ్ చేయాలని యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్నా తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 12 విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 1445 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని, ఇప్పటివరకు రాష్ట్రంలో మంత్రులందరికీ తమ సమస్యలు విన్నవించామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, డాక్టర్ నిరంజన్, సరిత, వైశాలి, శ్రీమాతా, దిలీప్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.