ఉపాధి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-బూర్గంపాడు
ఉపాధి కార్మికుల సమస్యలు పరిష్కారించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో నాగినేని ప్రోలురెడ్డిపాలెంలో శనివారం ఉపాధి కూలీల పని ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన వేతనం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పని పథకానికి 3 లక్షల కోట్లు కేటాయించాలని, రోజు కూలి రూ. 600 ఇవ్వాలని పేర్కొన్నారు. సంవత్సరంలో 200 రోజు పని కల్పించాలని, కొలతలు లేకుండా వేతనాలు ఇవ్వాలని తెలిపారు. ఎర్రటి ఎండలో కాలుతున్న మంచినీరు తాగుతూ పనిచేస్తున్న ఉపాధి కార్మికులకు వేతనం రూ. 100 నుండి రూ. 150 వరకే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు మండుతున్న ఎండలకు కనీసంనికి రోజుకు రూ. 600 ఇవ్వాలని, ధరలకు అనుకూలంగా వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మూడు ఫోటోలు పేరుతో ఉపాధి పనిని దూరం చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తుందన్నారు. రోజురోజుకీ పనికి దూరమవుతున్న ఉపాధి కార్మికులకు ప్రభుత్వం నుండి ఎటు వంటి సహకారం లేదని తెలిపారు. మంచినీరు గాని టెంటు, ఆటో ఛార్జింగ్‌, గడ్డపలుగు, బిల్లు తట్టలు, బిల్లు మెట్లు పారదర్శకం ఎటువంటివి కూడా లేకుండా మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బయ్య రాము, అధ్యక్షులు ఎస్‌కే.అబిదా, రాములు మరియమ్మ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.