– వ్యకాస మండల అధ్యక్ష, కార్యదర్శులు కాళ్ళ జంగయ్య,ఆవుల యాదయ్య
నవతెలంగాణ-మంచాల
ఉపాధి హామీ చట్టంలో కూలీల సమస్యలు పరిష్కరించి, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కాళ్ళ జంగయ్య, ఆవుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో సరైన బడ్జెట్ కేటాయించాలని,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు. అంతేకాకుండా కూలీలకు కూలిబంధు చట్టం అమలు చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలి రూ. 600 చెల్లించాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు పని దినాలు 200 రోజులకు పెంచాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. అంతేకాకుండా పని చేసే ప్రదేశంలో మెడికల్ కిట్లు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హులైన కూలీలకు దళిత బంధు, బీసీ బంధు ఇవ్వాలన్నారు. గహలక్ష్మి పథకం అర్హులం దరికీ వర్తింపజేయాలని ప్రభుత్వానిష్ట్ర్న డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు డి.అజారు బాస్, కల్పన, మండల కమిటీ సభ్యులు వెంకటయ్య, యాదయ్య, ఎస్.రాజు, రవి రాజు తదితరులు పాల్గొన్నారు.