– టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన
నవతెలంగాణ-సంగారెడ్డి
వివిధ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న గురుకుల టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వై.జ్ఞాన మంజరి మాట్లాడుతూ.. 6 మేనేజ్మెంట్లలో ఉన్న గురుకుల టీచర్ల బదిలీ లు, పదోన్నతులు నిర్వహించాలన్నారు. ఒకే రకమైన పరిపాలన విధానం ఉండాలని, హెల్త్ కార్డులు, ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలన్నారు. పారిటి స్కేల్స్ ఇవ్వాలని, కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పని భారం తగ్గించి, అధికారుల వేధింపులు ఆపాలని కోరారు. నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వాలని, పీవో 2018 కు సంబంధించి కోర్టు వివాదాలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కాంట్రాక్టు, గెస్ట్, పార్ట్ టైం, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు బేసిక్ పే, 12 నెలల వేతనం ఇవ్వాలన్నారు. ఆర్ట్, క్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్లకు, స్టాఫ్ నర్స్‌లకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలన్నారు. అన్ని సొసైటీల్లో ప్రిన్సిపాల్ 100శాతం, జేఎల్, పిజిటి పోస్టుల్లో 70శాతం ఇన్ సర్వీస్ పదోన్నతుల కోటగా నిర్ణయించాలన్నారు. వాటితోపాటు తదితర డిమాండ్స్‌ను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 5న చలో హైదరా బాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. గురుకుల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వారు ఉపా ధ్యాయులకు పిలుపునిచ్చారు. టీఎస్‌యూటీఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె.అశోక్, బి.సాయిలు, జిల్లా కార్యదర్శులు బి. సాయితేజ, బి. అరుణశ్రీ, సిహెచ్. కష్ణం రాజు, వి.అనురాధ నాయకులు ఆర్ .సింహాచలం, ఎం. విజనంద్, ఏ.వెంకయ్య, బి. కిష్టయ్య, జి. కష్ణ, లక్ష్మయ్య, కష్ణమూర్తి, జి. ప్రభాకర్, అశోక్, గురుల్ల్ టీచర్లు మోసిన్, రామన్న, శ్రీనివాస చారి, విటమ్మ, బి. శ్రీనివాసులు, ప్రశాంత్ గౌడ్, పరశురాములు, బసవరాజు, కవిత, మోహన్, కష్ణ, అర్చన, మల్లికార్జున్, ప్రవీణ్ పాల్గొన్నారు.
నవ తెలంగాణ సిద్దిపేట కలెక్టరేట్: గురుకులాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రమోషన్ కల్పించాలని, బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ డిమాండ్ చేసింది. టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షేక్ వలిహమ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం గురుకుల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ అధిక సంఖ్యలో సంక్షేమ గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేసిందన్నారు. ఆరేళ్లు గడిచినా స్వంత భవనాలు నిర్మించలేదన్నారు. ఉపాధ్యాయులను తగినంత మందిని నియమించలేదన్నారు. ఉన్న ఉపాధ్యాయులపై భారం పడుతున్నదన్నారు. బోధనేతర పనులతో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఐదేళ్లుగా గురుకుల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు నిర్వహించలేదన్నారు. సమస్యలన్నిటినీ పరిష్కరించకపోతే ఆగస్టు 5వ తేదీన పెద్ద ఎత్తున ఇందిరా పార్కు వద్ద గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. శిబిరంలో టీఎస్ యుటిఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి టి యాదగిరి ,కోశాధికారి ఎం కష్ణ జిల్లా కార్యదర్శులు కె.కనకరాజు ,డి.గిరిబాబు,టీ. శివలింగం, జిల్లా కమిటీ సభ్యులు ఎస్. వెంకటేశం, సీహెచ్, కష్ణ,ఎన్ నిరంజన్,జె. నర్సింలు, ఈ. రాజు, గురుకుల పాఠశాలల కన్వీనర్ వీ. కష్ణ, వెంకటలక్ష్మి,సరిత, రామ్మోహన్, చంద్రకాంత్, రాజిరెడ్డి, సుమన్ రమేష్, రాకేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.