మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Adialabad,Navatelangana,Telugu News,Telangana.నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌
మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఎఐటీయూసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సిర్ర దేవేందర్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. పారిశుధ్య రెగ్యులర్‌ కార్మికుల ఖాళీలను అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులతో భర్తీ చేయాలని అన్నారు. కార్మికులకు ప్రతినెల 5వ తేదీ లోపు వేతనం చెల్లించాలన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, పారిశుధ్య కార్మికులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి మెడికల్‌ చెకప్‌ చేయించాలని అన్నారు. అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అప్పటివరకు రూ.26వేల వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విలాస్‌, చిరంజీవి, కాంతారావు, కార్మికులు ఉన్నారు.