– సీఐటీయూ మండల కన్వీనర్ శేఖర్
నవతెలంగాణ-మహేశ్వరం
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ మండల కన్వీనర్ శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచా యతీల్లో వివిధ కేటగిరీలో పనిచేస్తున్న కార్మికుల సమ స్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,760 గ్రామ పంచాయతిలలో 50 వేల మంది సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లుగా వివిద కేటగిరీలో విధులు నిర్వ హిస్తు న్నారని తెలిపారు. వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని అన్నారు. ‘పంచా యతీలకు జనాభా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయి స్తామని, కొత్త చట్టం కేటాయించి పటిష్టం చేస్తామని వేతనాలు పెంచి వారిక ప్రత్యేక తరహాలో నిర్ణయాత్మకమైన ఉద్యోగ భద్రత కలిపిస్తామని’ ఇచ్చిన హామీలు అమలు కావడం లేద న్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి వారి సమస్య లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్య క్షులు అశోక్, బుజ్జమ్మ, చంద్రకళ, భారతమ్మ, యాదమ్మ, వెంకటయ్య, శ్రావణ్, నర్సింహ, రత్నం, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.