పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి
– ఇంటి ఎదుట జీపీ కార్మికులు నిరసన
– ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తాం
– సీఐటీయూ నాయకులు శ్రీనివాస్‌
నవతెలంగాణ-తాండూరు
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ సోమవారం తాండూరులో పంచా యతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏ సీ సీఐటీయూ ఆధ్వర్యంలో తాండూర్‌ కార్యాలయం వ ద్ద నిరవధిక సమ్మెలో భాగంగా సమస్యల పరిష్కా రం కోసం కృషి చేయాలనీ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షులు కే.శ్రీనివాస్‌ వ్యకాస జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్పలు మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ ఉద్యో గులు 40 ఏండ్లుగా అతి తక్కువ వేతనాలతో నిత్యం పారిశుధ్య పనులు తాగునీటి సరఫరా తదితర అనేక పనుల్లో గ్రామాలను ఉంచుతూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేస్తున్న గ్రామపంచా యతీల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరవ ధిక సమ్మె చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అధికారులను పంపుతూ స్పెషల్‌ డ్రైవ్‌ పేరుతో గ్రామాల్లో 4 రోజులుగా కొత్త గా కార్మికులను పెట్టి పనులు చేయాలని అధి కారులను ఆదేశించారు. జిల్లాలోని కేంద్రంలో పం చాయతీ సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు లేవని, తక్షణమే పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని, సమ స్యలు పరిష్కరించాలన్నారు. గ్రామాల్లో వారు చేసే పని ఇతరులతోటి చేయిస్తే తక్షణమే అడ్డుకుంటా మన్నారు. ‘మా పొట్ట మీద కొట్టొద్దని వివరిస్తామని’ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. ఎమ్మెల్సీ పి. మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గ్రామ పంచాయతీ కార్మికుల సమ స్యలు పరిష్కరానికి కృషి చేస్తా నని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నర్సిములు జిలాని సాయ్యప్ప అంజి లప్ప లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.