నవతెలంగాణ-కాగజ్‌నగర్
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ అనుబంధ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వారిని పర్మినెంట్ చేసి, కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని, మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వమే కార్మికుల వేతనాలకు ప్రత్యేక గ్రాంట్ కేటాయించాలని, పీఆర్‌సీలో అర్హులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో 48 గంటల నిరాహారదీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమేష్, విజరు, మహేష్, రాజేష్, సురేష్, మధు, సుధాకర్ పాల్గొన్నారు.
సిర్పూర్(టి) : తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని సీఐటీయూ నాయకులు వెళిశాల కృష్ణమాచారి అన్నారు. గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఒక్కరోజు సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యతో పాటు అ్యవసర సేవలైన విద్యుత్, మంచినీటి సరఫరాలను కూడా నిలిపివేశామని ఇప్పటికి కూడ ప్రభుత్వం స్పందించకుంటే 48 గంటల నిరహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నగేష్, రాజన్న, లక్ష్మీ, భార్గవ్, పెంటపర్తి రాజ్ కుమార్, దుర్గ, తార, మారుతి, పోశం, శోభన్, భీమయ్య, శ్యాంరావ్, హరిశ్చంద్ర ప్రసాద్, నీలమ్మ, చిపల్లీ విక్రమ్, వెంకటేష్, వెంకన్న ,సుజాత సంతోష్ తిరుమల పాల్గొన్నారు.
కౌటాల : మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీ కార్మికుల ఒక్కరోజు సమ్మె నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా అధ్యక్షులు జాడే.మోరశ్వర్ మాట్లాడుతూ మల్టిపర్పస్ విధానం రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ అదేవిదంగా జీఓ నంబర్ 51 సవరణ, గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు నేరవెర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామం పంచాయతీ సంఘం నాయకులు, కారోబార్లు, కార్మికులు పాల్గొన్నారు.
కెరమెరి : జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో మండలంలోని వివిధ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు ఒకరోజుకు సమ్మెలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పెండిగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, శాశ్వత ఉద్యోలుగా గుర్తించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీపీ కార్మికులు తిరుసుల్ల సంతోష్, పొర్ల స్వామి, మల్లేష్, నాగేష్, శ్రీనివాస్, నరేష్, పోగుల రవి , జీపీ కార్మికులు పాల్గొన్నారు.