పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్రావు కోరారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఐదు డి ఏ లను విడుదల చేయాలని, నగదు రహిత వైద్యం అన్ని కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో అనుమతించాలని, పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు, కోశాధికారి ఈవిల్ నారాయణ, జిల్లా నాయకులు మధుసూదన్, కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.