– ఎస్ఎఫ్ఐ న జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్
నవతెలంగాణ అచ్చంపేట: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ లకు సంబంధించిన నిధులు వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎండి సయ్యద్ డిమాండ్ చేశారు. కళాశాలలో సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని వివిధ కళాశాలలో సర్వే నిర్వహించారు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిన నేటి వరకు పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయలేదన్నారు. ఎస్ఎఫ్ఐ యొక్క లక్ష్యం చదువుతూ పోరాడు చదువుకై పోరాడు అనే నినాదంతో ముందుకు వెళ్తుందని, అనేక సమస్యల సాధనకై ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని అన్నారు. కళాశాలలో ఎస్ఎఫ్ఐ కళాశాలల కమిటీలు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎండీ సుల్తాన్, అఖిల్ ఉదయ్ ,కిరణ్ ,చరణ్, రజనీకాంత్, రేఖ, అమృత, తదితరులు పాల్గొన్నారు.