నవతెలంగాణ – భిక్కనూర్
సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ప్రొఫెసర్ కోదండరాం హామీ ఇచ్చారు. బుధవారం మండలానికి చెందిన సర్పంచులు హైదరాబాదులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాములు కలిసి పలు సమస్యలను వివరించారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గత ప్రభుత్వం సర్పంచ్ల సమస్యలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డికి వివరించి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయనను కలిసిన వారిలో జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు నరసింహులు యాదవ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మధుమోహన్ రెడ్డి, సర్పంచ్ లు గుడిసె రాములు, తునికి వేణు, తదితరులు ఉన్నారు.