సీఐటీయు జిల్లా అధ్యక్షలు
ఏ. మహేంద ర్ రెడ్డి
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్ మనోహరాబాద్
వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్, తదితర సమస్యలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మనోహరాబాద్ మండలంలోని ఐకెపి మండల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 32రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ వివోఏలు నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు నిరవధిక సమ్మె చేస్తున్న వివోఏల టెంట్ వద్దకు గత రెండు రోజుల క్రితం ఏపియం వెళ్లి విధులకు హాజరు కావాలని. మహిళలు అని చూడకుండా భయభ్రాంతులకు గురిచేస్తూ వివోఏలను అందరిని విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. పోరాటాలు చేసి చేసి తెచ్చుకున్న తెలంగాణలో హక్కుల కోసం పోరాటాలు చేయకుండ అడ్డుకోవడమేంటని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా వివోఏ లను సీసీలు కూడా ఫోన్లు చేసి విధులకు హాజరు కావాలని బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. మనోహరాబాద్ మండలంలో 6,7 సంవత్సరాలుగా కొంతమంది సీసీలు పనిచేయడంలో ఆంతర్యమేమిటన్నారు. వెంటనే 6,7 సంవత్సరాలుగా పనిచేస్తున్న సీసీలను బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. వివోఏలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలన్నారు. వివోఏలకు రూ. 10 లక్షల సాధారణ, ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకు రూ.5లక్షలు కల్పించాలని, మహిళలకు ఇచ్చిన రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పోరాటం ఉదతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంజుల, సునీత, జగన్ ,దేవి, కవిత, కల్పనా, మమత ,అశ్విని ,నవనీత, స్వాతి సునీత తదితరులు పాల్గొన్నారు
ఐకెపి వివోఏల సమస్యలు పరిష్కరించాలి
ఐకెపి వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐకేపీ వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 32 వ రోజుకు చేరుకుంది. తూప్రాన్ ఐకేపీ కార్యాలయం ముందు వివోఏలు చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి సమ్మె చేస్తున్న సెర్ప్ ఉన్నతాధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఆన్లైన్ వర్క్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు తమ హక్కుల కోసం వీవోలు సమ్మె చేస్తుంటే ధాన్యం కొనుగోలను ఏదో ఒక పద్ధతిలో కొనుగోలు చేస్తామని సెర్ప్ ఉన్నతాధికారులు మాట్లాడడం తగదన్నారు. ఈ విషయంలో రాష్ట్ర సెర్ప్ సీఈవో జోక్యం చేసుకొని వివోఏ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కవిత, శోభ, సంతోష,స్వప్న, ఎల్లమ్మ, సత్యలక్మి, మల్లేషం, మహిశ్వరి, శ్రీలత,రేఖ, అంజమ్మ ,సంతోష,బలరాని, తదితరులు పాల్గొన్నారు