
రాజ్యాధికారంతోనే యాదవుల సమస్యలు పరిష్కారం అవుతాయని, జాతి ఐక్యత కోసం యాదవులంతా కలిసి రావాలని యాదవ రాజ్యాధికార సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఉప్పుల నాగమల్లు యాదవ్ అన్నారు. శనివారం యాదవ రాజ్యాధికార సాధన సమితి 2024 క్యాలెండర్ ను కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తో ఆవిష్కరింపజేసి మాట్లాడారు. ఈ మేరకు యావత్ దేశం బహుజన రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో నా జాతి బిడ్డలను బహుజన రాజ్యాధికారంలో ముందు వరుసలో ఉంచాలనే ఉద్దేశ్యంతో బడుగుల నాగార్జున యాదవ్ ఈ యాదవ రాజ్యాధికార సాధన సమితి స్థాపించడంజరిగిందన్నారు. దేశంలో యాదవ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా,సామాజికంగా, విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసికట్టుగా హక్కులను సాధించుకోవడానికి, ప్రతి యాదవ బిడ్డ కలిసి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో వీరబోయిన గంగరాజు యాదవ్, ఉప్పుల రాంబాబు యాదవ్,వీరబోయిన లింగమల్లు,భయ్యా మహేష్ యాదవ్,ఉప్పుల లింగయ్య యాదవ్,సందీప్ యాదవ్,మధు యాదవ్,మున్న మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.