ఓటర్ జాబితా తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలి; జిల్లా కలెక్టర్ అల

నవతెలంగాణ – అశ్వారావుపేట
పెండింగ్ ఉన్న దరఖాస్తులు బుధవారం వరకు  ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో  అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.  మంగళవారం ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి  ఫారం 6,7,8  నమోదు ప్రక్రియపై  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా  కలెక్టర్ ఐడిఒసి కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతన ఓటర్లు  ఫారం 6 ద్వారా 16099 దరఖాస్తు లు రాగా  14749 విచారణ పూర్తి చేయగా 350 పెండింగ్  ఉన్నాయని ఉన్నాయని చెప్పారు.అదే విధంగా మరణించిన ఓటరు తొలగింపుకు 4292  ఫారం 7 జారీ చేయగా మంగళవారం వరకు 3826 విచారణ ప్రక్రియ పూర్తి కాగా 448 పెండింగ్ ఉన్నాయన్నారు.  అలాగే ఓటరు చిరునామా మార్పులు,చేర్పులకు  ఫారం 8 కు  ద్వారా 21812 దరఖాస్తులు రాగా 21357 దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి కాగా 455 పెండింగ్ ఉన్నాయని చెప్పారు.అన్ని కలిపి ఫారం 6, 7, 8లకు 41205  దరఖాస్తులకు గాను 39952 విచారణ ప్రక్రియ పూర్తి చేశామని, మిగిలిన 1253 దరఖాస్తులు  బుధవారం వరకు ఎన్నికల కమిషన్  పోర్టల్ లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,ఆర్డీఓ లు స్వర్ణలత,రత్న కళ్యాణి,ఎస్.డీ.సీ శివాజి తదితరులు పాల్గొన్నారు.