ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలి

– డీఆర్డీఓ జయదేవ్ ఆర్య సూచన 
నవతెలంగాణ-బెజ్జంకి: మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా  కొనుగోళ్లను త్వరితగతిన చేపట్టాలని డీఆర్డీఓ జయదేవ్ ఆర్య సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని లక్ష్మీపూర్, దాచారం, గుగ్గీల్ల గ్రామాల్లో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఓ జయదేవ్ ఆర్య అకస్మికంగా సందర్శించి కొనుగోలు కేంద్రాల్లోని రికార్డులను పరిశీలించారు. కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలను త్వరత్వరగా చేసి టాబ్ ఎంట్రీ చేసి రైతులకు సహకరించాలని సూచించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ విద్యాసాగర్, ఏపీడీ ఓబులేసు, సీసీలు పద్మ, తిరుపతి, అయా  వీఓఏలు పద్మ,లావణ్య పాల్గొన్నారు.