మీరు చేసిన అభివృద్ధి మర్చిపోలేము..

The progress you have made will not be forgotten..నవతెలంగాణ – బజార్హత్నూర్
మండల కేంద్రంలోని చింతల్ సాంగ్వి గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుండి గ్రామంపై ఎంతో చొరవ తీసుకొని అభివృద్ధి చేసిన పంచాయతీ కార్యదర్శి భీమ్ సింగ్ ఇటీవల  బదిలీ కావడంతో శనివారం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తను చేసిన ఐదు సంవత్సరాల సేవలను గుర్తు చేస్తూ బదిలీ కావడంతో కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం ఆయనను గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువతి, యువకులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సుంగన్న, మాజీ సర్పంచ్ ప్రకాష్, పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్, గ్రామ పటేల్ భీమ్రావు, ఆదివాసి యూత్ అధ్యక్షుడు సుభాష్ తదితరులు పాల్గొన్నారు.