
నవతెలంగాణ – తొగుట
ప్రాజెక్టు నిర్మాణం మా నియోజకవవర్గంలో, నీరు పారేది పక్క నియోజకవర్గాలకు అని బీజేపీ నాయకులు, చందాపూర్ తాజా మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు యాదవ్ అన్నారు. శుక్రవారం కూడవెళ్లి వాగు వద్ద విలేకరుల తో మాట్లాడుతూ రెండు, మూడు రోజు ల క్రితం కూడవెళ్లి వాగులోకి నీరు వస్తుందని ఆశించామని అన్నారు. కానీ గజ్వేల్ నియోజకవర్గం కోల్గురు పరిసరా రైతుల పంట పొలాలకు వచ్చేలా నీటిని విడుదల చేయడం సరి కాదన్నారు. దుబ్బా క నియోజకవర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించు కోవడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపొంది నాలుగు నెలలు గడుస్తున్న దుబ్బాక రైతులను పట్టించుకో వడం లేదని ఆరోపించారు. దుబ్బాక నియోజకవర్గంలో నిర్మాణం చేసిన మల్లన్న సాగర్ నుండి గజ్వేల్, సిద్దిపేట, సిరిజిల్లా నియోజకవర్గం వర్గాలకు కాలు వల ద్వారా నీరు తరలించుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించిన దుబ్బాక నియోజకవర్గం, తొగుట మండలానికి నీళ్లు అందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి 6 గ్రామ పంచాయతీలు, 6 మధిర గ్రామాలు, వేల ఎకరాల పంట భూములు కోల్పోయిన రైతులు, వేల కుటుం బాలు రోడ్డున పడ్డాయన్నారు. స్థానిక మండలానికి చెందిన రైతుల పంట భూములకు నీరు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నియోజక వర్గానికి, తొగుట మండలానికి కూడవెళ్లి వాగు నుండి మొదలుకొని నర్మరం చెరు వు వరకు నీరు విడుదలకు కృషి చేయాలని కోరా రు. లేనియెడల పంటలు ఎండి రైతులు నష్టపోతా రని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని కూడవెళ్లి వాగులోకి వెంటనే నీటి ని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బెజగామా ఆంజనేయులు, ఎనుముల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.