నవతెలంగాణ-జహీరాబాద్
చెరకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎం.జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. జహీరాబాద్‌లోని ఆయ న నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంత చెరకు రైతులకు పరిశ్రమ యాజమాన్యం బకాయిల ఉన్న డబ్బుల ను వెంటనే చెల్లించాల న్నారు. చెరకు రైతుల కోసం గతంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే నిలబట్టుకోవాలన్నారు. స్థానికంగా ఉన్న చెరకు ఫ్యాక్టరీ యా జమాన్యం సరైన సమయంలో క్రషింగ్ చేయకపోవడం, గత సంవత్సరం క్రషింగ్ అయినా బకాయి డబ్బులను నేటికీ విడుదల చేయకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చెరకు రైతుల బకాయిలు విడుదల చేయించాలని.. లేని యెడల జహీరాబాద్ చెరకు రైతులు మరో ఉద్యమానికి నాంది పలు కుతారని హెచ్చరించారు. అంతేకాకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీ ప్రకారం రైతుబంధును వెంటనే విడుదల చేయాలన్నారు. సంక్రాంతి పండగ సందర్బంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహిళలు వారి ఇంటి ముందే ముగ్గులు వేయాలని.. తమ న్యాయ నిర్ణేతలు ఆ ముగ్గులను పరిశీలించి మొదటి, రెండో బహుమతులను ఎంపిక చేస్తార న్నారు. ఈ కార్యక్రమం జహీరాబాద్ టౌన్లోని వివిద కాలనీలల్లో జరుగుతుందని..ఎక్కడికక్కడే కాలనీలకు వచ్చి మొదటి, రెండో బహుమతులు నిర్ణయించి అందజేస్తారన్నా రు. ఈ కార్యక్రమంలో మల్చల్మా సొసైటీ చైర్మెన్, న్యాయవా ది బుచ్చిరెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ు సుధీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నౌబాద్ జగ న్నాథ్, బీజేపీ మండలాధ్యక్షులు అడివన్న తదితరులు పాల్గొన్నారు.