రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలు గడుస్తన్నా ఎన్నికల్లో ఇచిన్న హామీలను నెరవేర్చడం లేదని వెంటనే హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కిషన్ మోర్చ అద్యక్షులు తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని తహశీల్దార్ షబ్బీర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రూ. రెండు లక్షల రుణమాపి చేయాలని, కౌలు రైతుకు రూ. 15 వేలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఫసల్ బీమా యోజన అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సురేష్ నాయక్, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి ముప్పేడి గంగారెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు నల్లా గంగా మోహన్, కార్యదర్శి సంతోష్, ఆర్మూర్ ఓబిసి మోర్చా కన్వినర్ గంగోని వినోద్, బీజేపీ కోశాధికారి & శక్తి కేంద్రం ఇంచార్జి దేదావత్ రమేష్ నాయక్, మండల ఉపాధ్యక్షులు మామూళ్ళ రవి యాదవ్, ప్రధాన కార్యదర్శి మాదరి రాజేశ్వర్, అధికార ప్రతినిధి అశోక్ నాయక్, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుత్ప రాజు, కార్యకర్తలు ఒడ్డెన్న, కే. సాయిలు పాల్గొన్నారు.