బీసీఏ లోకి మారుస్తామన్న హామీని నిలబెట్టుకోవాలి

The promise of conversion into BCA should be maintainedనవతెలంగాణ – మోర్తాడ్

బిసి డి నుండి బీసీఏలోకి  ముదిరాజ్ కులస్తులను మారుస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని బాల్కొండ నియోజకవర్గ కులస్తులు కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గత ఎన్నికలలో బీసీఏ మారుస్తామని మేనిఫెస్టో పెట్టడం జరిగిందని నేటి వరకు వారిని ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో తప్ప ఇతర తెలంగాణ జిల్లాలలో అన్ని గ్రామాలలో మత్స్య సహకార సొసైటీలలో భాగస్వామ్యం కల్పించడం జరిగిందని రెండు ఉమ్మడి జిల్లాలలో మాత్రం ముదిరాజ్ కులస్తులకు మత్స్య సహకార సంఘం లో ఎలాంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఉపాధి కోల్పోతున్నామని అన్నారు. తక్షణమే రాష్ట్రప్రభుత్వం బీసీడీ నుండి బీసీలలోకి ముదిరాజ్ కులస్తులను కలుపుతూ వారికి రెండు జిల్లాలలో మత్స్య సహకార సంఘాలలో కూడా ఉపాధి కల్పించాలని బాల్కొండ నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జక్కం అశోక్ వినతి పత్రం పేర్కొన్నారు. తమ డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి తమకు న్యాయం చేసేలా కలెక్టర్ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు ముదిరాజ్ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.