మునుగోడు మండల అభివృద్ధి కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్ కోరారు. శనివారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హామీలకు అమలవుతాయని ఆశతో మండలంలోని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాలయాపన చేయకుండా వెంటనే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు , మండల కమిటీ సభ్యులు సాగర్ల మల్లేష్ , డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కట్ట లింగస్వామి, చేకూరి బిక్షం, ఎండి సిద్ధిక్, రాజు, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.