కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలి

The promises given to Kallu Geetha workers should be implemented– బుర్ర శ్రీనివాస్, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీతా కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని ములుగు జిల్లా కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల మండలంలోని పసర గ్రామంలో  పసర  గౌడ సంఘం  సోసైటి  అధ్యక్షులు  జక్కు పెద్ద  రాజు  కార్యదర్శి  బుర్ర వేణు  ఆద్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్  జయంతి  ఉత్సవాలు  నిర్వహించడం  జరిగింది  ఈ కార్యక్రమంలో సంఘం  ౌరవ  అధ్యక్షులు  బూర సురేందర్  పంజాల శ్రీనివాస్  బోట్టు పెద్ద  మనషులు జక్కు నర్సయ్యగౌడ్  జక్కు మొగిళి లు హాజరు కాగా కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్  మాటాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ  ఇచ్చిన హామీలను అమలు పర్చాలని ప్రతి గీత కార్మికుడికి సెప్టి మోకులు ఇవ్వాలని మోపేడ్ బైకులు ఇవ్వాలని 50 సంవత్సరాలు ప్రతి గీత కార్మికునికి 5000వేలు పించిన్ ఇవ్వాలి. ఏజెన్సీ గౌడ్ లను గీత కార్మికులుగా  గుర్తుంచి సభత్వం కార్డులు ఇచ్చి ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  పూజారి నర్సయ్య గౌడ్ బొమ్మగాని  శ్రీను  శోభన్ జాని దోనికలమళ్లేష్. కక్కెర్ల శ్రీను.ఆప్పి .మేర్గు సుధాకర్  బుర్ర వెంకన్న  జక్కు రణధీర్  మేర్గు మణికంఠ మరియు  గౌడ సంఘం సభ్యులు  పాల్గొన్నారు.