నవతెలంగాణ- మల్హర్ రావు
నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోతరవేని క్రాంతి ఆదివారం ఓక ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి చాలా సభల్లో ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిరోజే రైతులకు రైతుబంధు రూ.15 వేలు ఖాతాల్లో జమ చేస్తామని, వడ్లకు రూ.500 బోనస్ పెంచుతూ వెంటనే కొనుగోలు చేస్తామని, అసెంబ్లీ సమావేశాల మొట్టమొదటి రోజునే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పారన్నారు. ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచితంగా ప్రవేశపెట్టిన బస్ సౌకర్యం మహిళలకు ఉపయోగపడుతుంది కానీ, ఆ పథకం యొక్క భారాన్ని నిరుపేద ప్రజల మీద చూపించద్దన్నారు.ఇప్పటికైనా మాటలు కాకుండా చేతలు చూపించి ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వమని నిరూపించుకోవాలన్నారు.