ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

– ఐదెళ్ళు సహకరించిన వారందరికీ రూణపడి ఉంటాం: ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని ఉచిత బస్సు ఒకటి కల్పించి ప్రజలను మభ్య పెట్టారని కల్యాణ లక్ష్మి షాద్ ముబారక్ లకు తులం బంగారం రైతు రుణమాఫీ రైతు బీమా తదితర వాటిని వెంటనే అమలు చేసే విధంగా మండల అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేసిన ప్రజాప్రతినిధులకు నాయకులకు అధికారులకు రుణపడి ఉంటామని ఎంపీపీ భదవత్ రమేష్ నాయక్ అన్నారు.బుదవారం ఇందల్ వాయి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.అంతకు ముందు ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అందజేసిన అందజేస్తున్న పనుల వివరాలను సభకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ భదవత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామస్తులు జనరల్ వచ్చిన ఎంపీటీసీగ పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎంపిక చేయడం వల్లే ఎంపీపీ పదవి అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్ నా సహాయ సహకారంతో ఎంపీపీ గా ఐదేళ్లపాటు కొనసాగినట్లు వివరించారు.
 గ్రామంలో కనివిని ఎరుగని రీతిలో మండలంలోని నెంబర్ వన్ గా ఉంచడానికి ఆరు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశానన్నారు. ఇదే కాకుండా మండలంలోని అన్ని గ్రామాలలో రహదారులు ఆయకుల సంఘాల కు భవనాల నిర్మాణాలకు ప్రత్యేక కృషి చేసినట్లు ఆయన వివరించారు. ఉద్యమ సమయం నుండి టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని కానీ గత 15 నెలలు తన వద్దకు ఆయా పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు వచ్చి ఎన్నో పనులు చేయించుకున్నారని ఈరోజు కక్ష సాధింపు చేయలేదన్నారు కానీ గత కొన్ని నెలలుగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళమని, ఎవరు బెదిరింపులకు పాల్పడిన బెదిరిది లేదన్నారు. గత ప్రభుత్వ హాయంలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రసటిన్సులను పనులు మొదలుపెట్టిన పనులను ఈ ప్రభుత్వం ఆపివేసిందని కొన్నిచోట్ల పనులు కొనసాగుతున్న ఇంకొన్ని చోట్ల అగ్రిమెంట్ సైతం పూర్తయిన ఇప్పుడు క్యాన్సల్ చేసిన బాధాకరమన్నారు. గతంలో నూతన పనుల కోసం ప్రోసెడింగ్ పత్రాలు అందజేసి శిలాఫలకం వేసిన దాన్ని రద్దుచేసి మరోసారి పనులను ప్రారంభించడం ప్రజలు అన్ని గమనిస్తున్నారని అది కాకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చ బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో అనంత్ రావు, ఎంపీఓ రాజ్ కాంత్ రావు, సినియర్ అసిస్టెంట్ లక్ష్మారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ విమలబాయి, ఎంపిటిసిలు చింతల దాస్, మారంపల్లి సుధాకర్, కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, బాబు రావు,కో ఆప్షన్ సభ్యులు షేక్ హుస్సేన్,ఎంపీలు కిషన్, డిప్ చంద్  తోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.