భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి..

– గౌలిగుడ చమన్,బేగం బజార్ లేబర్ అడ్డాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షలు…
– మద్దతు తెలిపిన ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్
– దీక్షలను ప్రారంభించిన భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు..
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
పనులు దొరకక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు పట్టణ ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టీ సంవత్సరానికి 150 పనిదినాలు కల్పిస్తామని కేంద్ర బిజే పి సర్కార్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం   ఇచ్చిన ఇతర వాగ్దానాలను తక్షణం అమలు చేయాలని కోరుతూ బుధవారం భవన నిర్మాణ కార్మిక సంఘం( సిఐటియు)  ఆధ్వర్యం లో గౌలిగుడ చమన్ లేబర్ అడ్డ .బేగం బజార్ లేబర్ అడ్డా లలో కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.ఈ దీక్ష శిబిరానికి ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ హాజరై తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు.బి.సి.డబ్ల్యు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రాజు.సీఐటీయూ హైదరబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి ఎం.శ్రావణ్ కుమార్ లు మాట్లాడుతూ.. .భవన నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్రూం లు ఇంతవరకు కేటాయించలేదని లేదన్నారు . ప్రభుత్వం చెప్పిన మోటార్ సైకిల్ లు ఇవ్వలేదని అన్నారు. లేబర్ అడ్డా లలో షెడ్లు,ఉచిత భోజన సౌకర్యం కల్పించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కొత్త రేషన్ కార్డులు తక్షణం మంజూరీ చేయాలని డిమాండ్ చేశారు.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్షలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వా లు తక్షణమే ఈ సమస్యలపై స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీక్ష ల ముగింపులో  సీఐటీయూ గోషమహాల్ జోన్ నాయకులు కె.జంగయ్య,పి.నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఈ సమస్యలపై తహశీల్దార్,జిల్లా కలెక్టర్ ,లేబర్ కమిశనర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేసి వినతి పత్రాలు అందించామని  గుర్తు చేశారు. వీలైనంత త్వరగా పై సమస్యలు పరిష్కరించాలని లేనిచో కార్మికుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని వారు హెచ్చరించారు.ఈ దీక్షలలో కార్మిక నాయకులు తుపాకీ.ఆంజనేయులు,బి.గాంగపురి,ఎన్.వెంకటేష్, కోట సత్యనారాయణ,పి.భాగ్యమ్మ ,వేముల.అంజయ్య, కె.హన్మంతు, వి.శ్రీశైల, చారీ, నెమ్మది.కిరన్,మేకలరాజు, జి.నారాయణ, ఎం.లాలూ నాయక్, జే.ఉన్యా నాయక్, కె.నర్సింహులు,కే.రాజు,రమేష్, సి.బాల్ రాజు,గోవింద్ తదితరులు పాల్గొన్నారు