కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి..

The assurances given by the Congress government to the stone quarry workers should be implemented.నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ 

కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేజీ కేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లు గీత వృత్తి పై సుమారు 5 లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారు. వృత్తిలో విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ బ్రతుకుతెరువు కోసం ధైర్యం చేసి వృత్తిని కొనసాగిస్తున్నారు అని అన్నారు. గత ప్రభుత్వాల కంటే కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తదేమో అని గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు అని తెలిపారు. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన వాటిని అమలు చేస్తారని అనుకున్నాం. 2024 అక్టోబర్ 18న రాష్ట్రస్థాయి సదస్సు హైదరాబాదులో జరిపి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ 22 డిమాండ్స్ ను రూపొందించి ప్రభుత్వానికి అందజేశామని అన్నారు.కానీ ఇప్పటివరకు ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు అని ఆవేేేదన వెక్తం చేశారు.ప్రభుత్వ లెక్కల ప్రకారమే సభ్యత్వం కలిగిన వాళ్లు రాష్ట్రంలో 2 లక్షల 50 వేల మంది ఉంటే 10 వేల మందికి మాత్రమే పంపిణీ చేశారు అని అన్నారు.ఏడాది కాలంలో చనిపోయిన వారి కుటుంబాలకు, వికలాంగులైన వారికి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా 7 కోట్ల 95 లక్షల రూపాయలు ఇప్పటివరకు బాధితులకు అందలేదు అనీ అన్నారు. ఎన్నికల ప్రణాళికలో నెల రోజుల లోపు ఎక్సిగ్రేషియా చెల్లిస్తామని, 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతామన్నారు. అన్నమాట ప్రకారం అమలు చేయాలి అని ఏజెన్సీ ఏరియాలో వృత్తి చేస్తున్న గీత కార్మిక సొసైటీల పునరుద్ధరణ గురించి కూడా చర్యలు చేపట్టడం లేదు అన్నారు.కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎలుగూరి గోవిందు మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల పెన్షన్ ను చేయూత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. ఇంకా ఇది ఆచరణ రూపం దాల్చలేదు. వృత్తిలో ప్రమాదాలు జరిగిన వారికి టాడి కార్పొరేషన్ నుండి ఇస్తున్న తక్షణ సహాయం దహన సంస్కారాల కొరకు 25,000లు, దెబ్బలు తగిలిన వారికి 15,000 బడ్జెట్ లేదనే పేరుతో నిలిపివేశారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అబ్బగాని బిక్షం గునగంటి కృష్ణ జిల్లా సహాయ కార్యదర్శి బత్తుల జనార్ధన్ జిల్లా ఉపాధ్యక్షులు జెరిపోతుల కృష్ణ నోముల వెంకన్న బట్టిపల్లి నాగ మల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు అబ్బగాని కాశయ్య మండవ సైదులు బెల్లంకొండ ఇస్తారి సోమగాని మల్లయ్య బొల్లెపల్లి శ్రీనివాస్ బోడ సైదులు బోడ పరుశరాములు గుండగాని శ్రీనివాస్ డొనేట్ పిచ్చయ్య అనంతుల చంద్రయ్య బత్తిని నరేష్ పుట్ట చంద్రయ్య సిగ యాదయ్య గడ్డం ఎల్లమ్మ బూర సైదమ్మ యర్రగాని అనసూర్య పసునూరి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.