కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం
నవతెలంగాణ –  మునుగోడు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కాలయాపన చేయకుండా వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మండల శ్రీశైలం అన్నారు . శుక్రవారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే  రైతులకు పెట్టుబడి సహాయంగా ఎకరానికి 15 వేలు ఇస్తానని చెప్పి,  ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు గడుస్తున్న ఎకరంలోపు రైతులకు మాత్రమే  రైతు బంధు పథకం డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయడం ఏమిటని ప్రశ్నించారు . వెంటనే పూర్తిస్థాయిలో రైతు ఖాతాలోకి రైతుబంధు డబ్బులను జమ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేలను ఇస్తామని ప్రకటించిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. నల్గొండ జిల్లాలోని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును  పూర్తి చేసేందుకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలను ఏర్పరచుకునేందుకు ఇచ్చే హామీలుగా కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలతో మమేకమై  తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మిర్యాల భరత్ , సహాయ కార్యదర్శి వరికుప్పల ముత్యాలు , మండల కమిటీ సభ్యులు యాట యాదయ్య , యాసరాని శ్రీను,  వేముల లింగస్వామి , వడ్లమూడి హనుమయ్య , మేడి రాములు, కొంక రాజయ్య , పగడాల కాంతయ్య తదితరులు ఉన్నారు.