నవ తెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం బోర్గం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారాన్ని ఉదృతం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ను ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజా సంక్షేమ ఫలాలు నిరుపేదలకు అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దేనిని వారు స్పష్టం చేశారు. సుమారు 150 మంది కార్యకర్తలు గడపగడపకు ప్రజారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్ధవాని సాయి రెడ్డి, ఫిరోజ్ ఉద్దీన్, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్ ,పార్ధ రాజు, మహిళలు, యువత అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.