నగరంలోని స్థానిక మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ప్రధాన కార్యాలయం వద్ద దివ్యాంగుల ప్రయాణ సౌకర్యార్థం స్నేహ సొసైటీ సిటీ బస్ కొనుగోలు చేసి స్కూలు బస్సును శుక్రవారం నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గాదన్న గారి విటల్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సౌకర్యార్థం వీరికి ఉచిత ప్రయాణం కల్పించడానికి స్నేహ సొసైటీ స్కూల్ బస్సులో కొనుగోలు చేసి దివ్యాంగులకు ఇంటి నుండి పాఠశాల వరకు ఉచితంగా తీసుకురావడం అభినందనీయమని అన్నారు దివ్యాంగులు స్కూలు బస్సు ద్వారా సురక్షితంగా ప్రయాణించగలుగుతారని దాదాపు ఒక వంద 45 మంది దివ్యాంగులకు ఉచిత పరవాన్న సౌకర్యం కల్పించడం కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, కోఆర్డినేటర్ కిరణ్మై మహేష్ తదితరులు పాల్గొన్నారు.