– అధిక మాసం పురస్కరించుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం నిర్వహించిన మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్
నవతెలంగాణ మద్నూర్
అధిక మాసాన్ని పురస్కరించుకొని మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం నాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు మద్నూర్ మేజర్ గ్రామ సర్పంచ్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు సురేష్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి మండల ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు మండల అధికారులు ఆయా పార్టీల నాయకులు వ్యాపారవేత్తలు వారి కుటుంబ సభ్యులు బంధువులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.