
ఫిబ్రవరి 14 ఇండియన్ మిస్టరీలోను ఇదొక చీకటి రోజుగా మిగిలిపోయిందని ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలి మారుతి అన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల అందరికీ ఘన నివాళులు అర్పించారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో భారత ఆర్మీ జవాన్లు 40 మంది వీరమరణం పొంది నేటికీ 5 సంవత్సరాలు అవుతున్న సందర్బంగా వారు మన భారతదేశానికి చేసిన సేవలను స్మరిస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్మీ జవాన్ విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతీ అలాగే ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంబరతి పోషన్న, జాయింట్ సెక్రెటరీ కొత్తపెళ్లి రాజు, యూత్ ఇంచార్జ్ చింతగింజ రాజు, నేన్నాల రాకేష్, సుంకరి ఆకాష్, తదితర సభ్యులు పాల్గొన్నారు