నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ లో మంగళవారం ఒక్క సారిగా మబ్బులు వచ్చి అకస్మాత్తుగా వర్షం కురిసింది. దీంతో మార్కెట్ యార్డు, కల్లల వద్ద ఉన్న ధాన్యం పూర్తిగా తడిసింది. హుస్నాబాద్ లో అరగంటకు పైన వర్షం పడటంతో రైతులు అయోమయానికి గురయ్యారు. మార్కెట్ యార్డులో పరుదలను అందుబాటులో పెట్టుకోలేక పోవడంతో రైతుల ధాన్యం పూర్తిగా తడిసింది. తెలంగాణకు వర్ష సూచన ఉందని తెలిసిన అధికారులు పరుదలను అందుబాటులో ఉంచకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ యార్డులో ఇప్పటికైనా అధికారులు రైతులకు తాటిపారుదలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.