ఎండుతున్న పంటలకు జీవం పోసిన వర్షం

– మురిపించి దోబూచులాడుతున్న వరుణదేవుడు
– ఆందోళనలో రైతన్నలు
నవతెలంగాణ-మర్పల్లి
ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ముందస్తు వర్షాలు కురవ డంతో సంతోషం పట్టలేని రైతన్నలు గంపెడు ఆశ లతో ఖరీఫ్‌ పంటలు సాగు చేసుకున్నారు. వరు సగా వారం రోజులు ముందస్తు వర్షాలు కురవడం తో ఖరీదైన పంట పెట్టుబడులు పెట్టి పత్తి, మక్క, కంది, సోయా మినుము,పెసర, తదితర పంటల ను సమయం ఉన్న ముందస్తు వర్షాలకు సాగు చేసుకున్నారు. గంపడు ఆశలు పెట్టుకొని చేసు కున్న పంటలు 20 రోజులుగా వర్షాలు జాడ కని పిం చకపోవడంతో సాగు చేసిన పంటలు ఎండు ము ఖం పట్టాయి దీంతో రైతన్న పంట పెట్టుబడులు కృధాగా మారి మరోసారి విత్తనాలు విత్తుకోవలసి వస్తుందేమోనని ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆదివారం కురిసిన ఓ మాదిరి వర్షం ఎండు ముఖం పట్టిన పంటలకు జీవగంచిపోసి బతికించినట్లయిందని మరో వారం రోజులు పం టలు బతుకుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. మండలంలో 80 శాతం మంది రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడి జీవనం కొన సాగిస్తుంటారు. వానొస్తే పండే ఎండ కొడితే ఎండే అనే విధంగా ఇక్కడ వ్యవసాయం ఉంది, విత్త నాలు, ఎరువులు, రసాయన మందులు, బాడిగలు, కలుపుతీత కూలి రేట్లు, విపరీతంగా పెరగడం, అడవి పందుల బెడద, ప్రకృతి వైపరీత్యాలు, సరైన పంట దిగుబడులు రాక, మద్దతు ధర లభించక వ్యవసాయం దండగే అనే ఆలోచనకు రైతులు వస్తున్నారు. ప్రతి ఏటా ఏదో ఓ రకంగా రైతన్న నష్టపోతునే ఉన్నాడు పంట పెట్టుబడులు రాకున్నా మొండి ధైర్యంతో మరోసారి అప్పులు చేసి పంటలు సాగు చేస్తూనే ఉన్నాడు, సరైన వర్షాలు లేక కొందరు రైతులు మళ్లీ విత్తనాలు విత్తు కోవాల్సిన పరిస్థితి దాపురించింది,కొందరు రైతులు దాట్లు విత్తుకుంటున్నారు.