నల్లగొండ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

నవతెలంగాణ – వలిగొండ రూరల్
నీటి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పే ప్రయత్నానికి నిరసనగా మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రజా గర్జన సభకు మండలకేంద్రం తో పాటు మండలంలోని వివిధ గ్రామాల నుండి బీఆర్ఎస్ శ్రేణులు నల్లగొండకు భారీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, పడమటి మమతా నరేందర్ రెడ్డి, గూడూరు శివాశాంత్ రెడ్డి, కీసర్ల సత్తి రెడ్డి, చెరుకు శివయ్య, కొమురెల్లి సంజీవ రెడ్డి, సోలిపురం సాగర్ రెడ్డి, మొగుళ్ళ శ్రీనివాస్, డేగల పాండరి, కేసరి రాం రెడ్డి, కాసుల కృష్ణ, ముద్దసాని కిరణ్ రెడ్డి, బొడ్డుపెల్లి కృష్ణ, మామిళ్ళ రత్నయ్య, ఆకుల వెంకన్న, మోటే నరసింహ, కల్కూరి రాములు, వీరమల్ల బాలేశ్వర్, కాడిగళ్ల లింగయ్య, పాండు తదితరులు పాల్గొన్నారు.