కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు

నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్ర రెండో నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు గురువారం ప్రమాణ స్వీకారం చేయడం పట్ల గురువారం స్థానిక కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరిపారు. పోలీస్ స్టేషన్ సెంటర్లో, మండలంలోని పాత నారంవారిగూడెంతో పాటు పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలంతా కలిసి కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. అనంతరం పెద్ద స్థాయిలో బాణసంచాలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో నాయకులు మొగళ్ళపు చెన్నకేశవ రావు, సర్పంచ్ అట్టం రమ్య, ఉప సర్పంచ్ రేమళ్ల కేధర్నాధ్, సొసైటి చైర్మన్ చిన్నం శెట్టి సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యురాలు వేముల భారతి, జూపల్లి ప్రమోద్, నండ్రు రమేష్, వేముల ప్రతాప్ పాల్గొన్నారు.