మండలంలోని చిన్నపూర్ గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఆర్డీఓ పాల్గొని లబ్దిదారుల నుంచి దరఖాస్తులను మంగళవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దరఖాస్తు తీసుకోబడుతుందని తెలిపారు. అన్ని వివరాలను దరఖాస్తు ఫారంలో నింపాలని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, స్థానిక సర్పంచ్ పుప్పాల లక్ష్మి, ఎంపిటిసి సత్యనారాయణ ప్రజలు పాల్గొన్నారు.