విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెంచాలి

విద్యార్థుల్లో పఠనా సామర్థ్యం పెంచాలి– జిల్లా విధ్యాధికారి శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ-వర్గల్‌
మండలంలోని నెంటుర్‌ ఉన్నత పాఠశాలలో ఎఫ్‌ ఎల్‌ ఎన్‌ (ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసి)పై ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయు లకు జరిగే కాంప్లెక్స్‌ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా విద్య అధికారి శ్రీనివాస్‌ రెడ్డి హాజరై మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి పిల్లలకు పాఠ్యపుస్తకాలను, పీరియడ్‌ ప్లాన్లను, వర్క్‌ షీట్లను అనుసంధానం చేస్తూ విద్యార్థులకు బోధించాలన్నారు. ఈ పద్ధతిని అనుసరిస్తే విద్యార్థుల సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. అలాగే వర్క్‌ షీట్లలో విద్యార్థుల సామర్ధ్యాలను పరీక్షించడానికి పెట్టినటువంటి అభ్యాస పత్రాలను చేయించాలని వాటిని క్రమం తప్పకుండా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని, గ్రంథాలయ పుస్తకాలను విద్యార్థులు తప్పులు లేకుండా చదివే సామర్థ్యాన్ని పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించా రు. ఈ కార్యక్రమంలో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కనకరాజు, వెంకటేశ్వర్‌ గౌడ్‌ తదితరులున్నారు.