వరద కాలువపై చెక్‌ డ్యాం ధ్వంసం చేసిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి

– పరిశీలించిన రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్‌ సారిక
– పనులు నిలిపివేత
నవతెలంగాణ-శంషాబాద్‌
రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. ఎలాం టి అనుమతులు తీసుకోకుం డానే అడ్డుగా ఉన్న కాలువలు, చెక్‌ డ్యాములు, చెట్లను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నా రు. తాజాగా మండల పరిధిలోని చౌదరిగూడ సర్వేనెంబర్‌ 241లో వరద కాలువ విధ్వంసం జరిగింది. అక్కడ గతంలో ప్రభుత్వం నిర్మించిన ఆనకట్ట (చెక్‌ డ్యాం)ను ధ్వంసం చేయడంతో పాటు ఉన్న చెట్లను జేసీబీతో తొలగించారు. ఈ చెక్‌ డ్యామ్‌ ధ్వంసం చేసి కాలువను పూడ్చి ఆక్రమిస్తున్నారని గ్రామానికి చెందిన ఏపూరి పవన్‌ కుమార్‌ రెవెన్యూ అధికారులకు శనివారం ఫిర్యాదు చేశాడు. దీంతో రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్‌ సారిక ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడే ఉండి పనులు చేయిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సురేష్‌ కుమార్‌తో పాటు స్థానిక రైతులను చెక్‌ డ్యామ్‌ ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టా భూమి అయిన వరద కాలువ చెక్‌ డ్యామ్‌ చెట్లను అనుమతి లేకుండా ధ్వంసం చేయడం నేరమని అన్నారు. ఇక్కడ చెట్లు, వరద కాలువ పూడ్చివేత, గతంలో ప్రభుత్వాలు నిర్మించిన చెక్‌ డ్యామ్‌ను తొలగించారని తెలిపారు. ఇది ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం కింద పరిగణిస్తున్నామన్నారు. వెంటనే పనులు ఆపేయాలని అక్కడ కాల్వను పూడ్చివేసిన చెట్లను మట్టిని తొలగించాలని వారికి చెప్పారు. ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడి వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కఠిన చర్యలు తీసుకోవాలి : ఏపూరి పవన్‌కుమార్‌, చౌదరిగూడ.
చౌదరిగూడ గ్రామంలో మధుపాల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 100 ఎకరాల భూమికి ఫ్రీ కాస్ట్‌ ప్రహరీ గోడ నిర్మిస్తున్నాడు. ఇందులో భాగంగా సర్వేనెంబర్‌ 241లో వరద కాలువ ధ్వంసం చేసి అనకట్ట కూడా తొలగించారని తెలిపారు. ప్రజా, రైతు ప్ర యోజనాలు దృష్టిలో ఉంచుకొని భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా నాటి ప్రభుత్వాలు వరద కాలువలపై ఆనకట్టలు లక్షల రూపాయలతో నిర్మించాయని తెలిపారు. అయితే వీటిని ఎలాంటి అనుమతులు లేకుండా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు స్థానిక రైతులతో కుమ్మక్కై ధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.