బీజేపీ అసలు బండారం బయట పడింది

– టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు నిరంజన్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ అసలు బండారం మరోసారి బండారం బయటపడిందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు నిరంజన్‌ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలోని సెక్యులర్‌ పదాన్ని తొలగిస్తామంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌ కుమార్‌ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దుష్యంత్‌ వ్యాఖ్యలపై నరేంద్ర మోడీ, అమిత్‌లు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.