ఎర్రజెండానే కార్మికులకు అండ: అవుతా సైదులు

నవతెలంగాణ – హలియా 

ఎరుపులోన మెరుపు ఉండి పోరాడే శక్తి ఉన్న గలది ఎర్రజెండాయని అదే కార్మికుల కు అండ అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు అన్నారు.హాలియాలో సీఐటీయూ 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ సెంటర్లో జెండాలు ఎగురవేసి కేక్ కట్ చేసి కార్మికులకు పంపిణీ చేశారు అనంతరం మాట్లాడుతూ.. 1970 లో కలకత్తాలో జరిగిన మహాసభల్లో సీఐటీయూ ఆవిర్భవించి 54 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలు గత వారం రోజుల నుండి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెమినర్లు, సదస్సులు ఏర్పరిచి సిఐటియు వివిష్టతను కార్మికులకు వివరించడం జరిగింది. కార్మికుల సమస్యల పరిష్కారం కోసంపుట్టినటువంటి సీఐటీయూ, ఏ ఒక్క కార్మికునికి ఎలాంటి బాధ కలిగిన ఆ కార్మికుని సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సీఐటీయూ నికరంగా నిలబడి పోరాడే సత్తా సామర్థ్యం ఉన్నటువంటి యూనియన్ సీఐటీయూ, బీజేపీ  కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టదాయకమైనటువంటి విధానాలు అవలంబిస్తున్న ది స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోడ్లుగాకేంద్ర ప్రభుత్వం విభజించి కార్మికులు సంఘాన్ని పెట్టుకునే అటువంటి హక్కులేకుండా చేస్తున్నది 8 గంటల పని దినాన్ని సాధించుకున్న కార్మికులకు 12 గంటల పని విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నదిప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల సొమ్ము కానీ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులన్నీ అప్పనంగా అంబానీ, ఆదాని, నీరాజు మోడీ లాంటి వాళ్ల చేతుల్లో పెడుతున్నది రైల్వే, ఎల్ఐసి, సింగరేణి, ఓడరేవులు, ఎయిర్ లైన్, ఎయిర్పోర్ట్లు, బ్యాంకులు, అప్పనంగా ప్రైవేట్ వాళ్లకు అప్పజెప్తుంది.54వ సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని గత పోరాటాలని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కార్మికుల హక్కుల కోసం పోరాటాలను ఉధృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో భవన నిర్మాణం కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్కే సయ్యద్ హుస్సేన్ నాయకులు ఏ సుబ్బు జాను మియా అన్నపాక శ్రీను తోటిపల్లి వెంకటయ్య అనుముల అంజి లింగయ్య శంకర్ ఆంజనేయులు ఈ దయ సైదమ్మ రజిత వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.