రైజింగ్‌న‌గ‌ర్‌లో ఎర్ర‌జెండ ర‌య్ ర‌య్‌

'లాల్‌ లాల్‌ లహర్‌ ఆయేగా, షోపత్‌ జైపూర్‌ జాయేగా' అనే నినాదాలతో భారత్‌-పాక్‌ సరిహద్దు గ్రామమైన ఖ్యాలీవాలాలో సీపీఐ(ఎం) అభ్యర్థి షోపత్‌ రామ్‌– ప్రచారంలో దూసుకుపోతున్న సీపీఎం అభ్యర్థి షోపత్‌ రామ్‌
– కాంగ్రెస్‌, బీజేపీలకు చెమటలు పట్టిస్తున్న యువనేత
‘లాల్‌ లాల్‌ లహర్‌ ఆయేగా, షోపత్‌ జైపూర్‌ జాయేగా’ అనే నినాదాలతో భారత్‌-పాక్‌ సరిహద్దు గ్రామమైన ఖ్యాలీవాలాలో సీపీఐ(ఎం) అభ్యర్థి షోపత్‌ రామ్‌ మేఫ్‌ువాల్‌కు గ్రామస్తులు స్వాగతం పలికారు. చాలా గ్రామాలు సిక్కు మూలానికి చెందిన రైతులతో ఉన్నాయి. వీరంతా 19వ శతాబ్దంలో పంజాబ్‌ నుంచి వలస వచ్చినవారు. పాకిస్థాన్‌కు ఆనుకుని ఉన్న శ్రీగంగానగర్‌, అనుప్‌గఢ్‌ జిల్లాల ప్రాంతం మొత్తం ప్రస్తుతం సిక్కుల వ్యవసాయ భూమి. రాజస్థాన్‌లోని షెఖావతి ప్రాంతం మాదిరిగానే, గంగానగర్‌,అనుప్‌గఢ్‌ ప్రాంతంలో కూడా వ్యవసాయ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ”వ్యవసాయానికి కాలువ నీటి కొరత. చీడపీడల కారణంగా పత్తి పంటలకు నష్టం వాటిల్లడం, పంట నష్టం జరిగినా బీమా అందని పరిస్థితి” వంటి వ్యవసాయ సమస్యలు ఉన్నాయి. అనుప్‌గఢ్‌ జిల్లాలో భాగమైన రైజింగ్‌నగర్‌లో సీపీఐ(ఎం) అభ్యర్థి షోపత్‌రామ్‌ వ్యవసాయ రంగంలోని సమస్యలను ప్రజల ముందుంచుతున్నారు. షోపత్‌ రామ్‌ గత రెండు దశాబ్దాలుగా రైజింగ్‌నగర్‌ రైతులతో కలిసి పనిచేస్తున్నారు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2004లో గంగానగర్‌, అనుప్‌గఢ్‌ ప్రాంతాల్లోని రైతులు కాలువ నీటి కోసం నెలల తరబడి ఉద్యమించారు. ఏఐకేఎస్‌ నాయకత్వంలో ఉద్యమం సాగింది. అప్పట్లో ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు షోపత్‌రామ్‌ కూడా పోరాటంలో చురుగ్గా భాగస్వామ్యం అయ్యారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు రైతులు చనిపోయారు. ఉద్యమం నేపథ్యంలో ఇందిరా కెనాల్‌ ద్వారా గంగానగర్‌, అనుప్‌గఢ్‌ ప్రాంతాలకు ఎక్కువ నీరు చేరింది. పోరాటం విజయవంతమైంది. కానీ షోపత్‌ సింగ్‌ సహా నేతలను తప్పుడు కేసుల్లో జైల్లో పెట్టారు. నాలుగు నెలల జైలు శిక్ష షోపత్‌ సింగ్‌ను ఉక్కు మనిషిగా తయారు చేసింది. ఆ తరువాత రైతుల కోసం అనేక పోరాటాలకు షోపత్‌ సింగ్‌ నాయకత్వం వహించారు. 2018 ఎన్నికల్లో రైజింగ్‌నగర్‌లో 43 వేలకు పైగా ఓట్లతో షోపత్‌ సింగ్‌ రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ బల్వీర్‌ సింగ్‌ లూథ్రా, కాంగ్రెస్‌ అభ్యర్థి సోహన్‌ లాల్‌ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం రైసింగ్‌నగర్‌లో షోపేత్‌ సింగ్‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉందని సీపీఐ(ఎం) తాలూకా కార్యదర్శి కలు థోరి అన్నారు. ఈసారి కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థి, గత ఎన్నికల నుంచి కాంగ్రెస్‌ రెబల్‌. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేసిన సోనాదేవి ఇప్పుడు కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ రెండూ కులం కార్డులతో ఓట్లు దండుకునే పనిలో నిమగమైయ్యాయి. అయితే సీపీఐ(ఎం) ఆశ అన్ని వర్గాల రైతులు, కార్మికుల మద్దతుపైనే ఉంది” అని కలు థోరి అన్నారు.
సీపీఎం వెంట రైతులు సీపీఎం అభ్యర్థి షోపత్‌ రామ్‌
గత ఎన్నికల కంటే పరిస్థితి అనుకూలంగా ఉందని సీపీఐ(ఎం) అభ్యర్థి షోపత్‌ రామ్‌ అన్నారు. ప్రజాశక్తి, నవ తెలంగాణ ప్రతినిధితో ఫోన్‌లో షోపత్‌ రామ్‌ మాట్లాడారు. గత ఐదేండ్లుగా నియోజకవర్గంలో ప్రజలతో మమేకమయ్యారు. నియోజకవర్గంలో చాలా మేర చిన్న రైతులే ఉన్నారు. వ్యవసాయానికి పంజాబ్‌ నుంచి కాలువ నీటిని పొందడం ఎల్లప్పుడూ సమస్య. ఆ దశలన్నింటిలోనూ రైతులు సంఘటిత ఆందోళనలతో అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఒప్పంద కూలీలకు సకాలంలో డబ్బులు అందడం లేదు. పని గంటలు కూడా తక్కువ. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు వెతికే పనిలో చురుగ్గా పాల్గొన్నారు. నియోజకవర్గంలో రైతులకు పంటల బీమా అందని పరిస్థితి నెలకొంది. ఇది సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకతగా మారింది. నియోజకవర్గంలోని 20 వేల మంది శిఖం రైతుల్లో అధిక భాగం ఈసారి సీపీఎం వెంటే ఉన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన చారిత్రాత్మక పోరాటమే సిక్కు రైతులను సీపీఐ(ఎం)కు దగ్గర చేసింది. గత ఎన్నికల్లో వారి ఓట్లు పూర్తిగా బీజేపీకే పడ్డాయి. కాల్వ నీటి కోసం కిసాన్‌ సభ చేపట్టిన ఆందోళన కూడా రైతుల ఓట్లకు మరింత అనుకూలంగా ఉండేందుకు దోహదపడింది.
బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ సంస్థాగత సమస్యలను ఎదుర్కొంటున్నాయి. బీజేపీకి చెందిన స్థానిక ఎంపీ, వారి ఎమ్మెల్యేతో సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు మరోసారి రెబల్‌ వేధింపులు ఎదురయ్యాయి. వారి మహిళా నేత ఒకరు తిరుగుబాటు చేశారు. సీపీఐ(ఎం) రెండేండ్ల క్రితమే ఎన్నికల కార్యకలాపాలు ప్రారంభించింది. నియోజకవర్గంలోని 278 పోలింగ్‌ బూత్‌లలో క్రియాశీలక కమిటీలు ఉన్నాయి. కోవిడ్‌ కష్టకాలంలో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల కార్యకలాపాలు రైజింగ్‌ నగర్‌, నగరంతో సహా ఇతర ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్లాయి. ఇదంతా ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని షోపత్‌ రామ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.